హోలీ వేడుక‌ల్లో ఎమ్మెల్యే అత్యుత్సాహం!

  • హోలీ వేడుక‌ల్లో మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్
  • తన క్యాంప్ ఆఫీసులో హొలీ సంబరాలు 
  • యువ‌కుల నోట్లో మ‌ద్యం పోసిన ఎమ్మెల్యే
  • వైర‌ల్‌గా మారిన ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ వీడియో
హోలీ వేడుక‌లను టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ ఈ రోజు మాంచి జోష్ తో నిర్వహించడం కలకలం రేపింది. హోలీ వేడుక‌ల్లో భాగంగా మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ తన క్యాంప్ ఆఫీసులో యువ‌కులతో క‌లిసి చిందులేశారు. అక్క‌డితో ఆగకుండా హుషారుగా యువ‌కుల నోళ్ల‌లో మ‌ద్యం బాటిల్‌లోని మ‌ద్యం పోస్తూ వాళ్లలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. 

ఇలా యువ‌కుల నోళ్ల‌లో స్వ‌యంగా ఎమ్మెల్యేనే మ‌ద్యం పోస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. ఇలా ఎమ్మెల్యేనే స్వయంగా తన క్యాంప్ ఆఫీసులో యువకులతో కలిసి మందుతో వేడుక చేసుకోవడం చర్చనీయాంశమైంది.


More Telugu News