చూపెట్టినదంతా నిజం కాదు!.. ద కశ్మీర్ ఫైల్స్‌పై ఒమర్ అబ్దుల్లా విసుర్లు!
- ద కశ్మీర్ ఫైల్స్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు
- పలు రాష్ట్రాల్లో చిత్రానికి వినోద పన్ను మినహాయింపు
- చిత్రంపై ఒమర్ అబ్దుల్లా నెగెటివ్ కామెంట్స్
జమ్ము కశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాలే నేపథ్యంగా తెరకెక్కిన ద కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ చిత్రానికి చాలా రాష్ట్రాలు వినోద పన్ను మినహాయింపును కూడా ఇచ్చాయి. బాలీవుడ్‌లో రికార్డులు బ్రేక్ చేస్తూ సాగుతున్న ఈ చిత్రంపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి.
జమ్మూ కశ్మీర్ రాజకీయాల్లో కీలక పార్టీగా కొనసాగుతున్న నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా శుక్రవారం నాడు ఈ చిత్రంపై స్పందించారు. ఈ చిత్రంలో చూపెట్టినదంతా నిజమేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని బీజేపీకే చెందిన కవీందర్ గుప్తానే వెల్లడించారని కూడా అబ్దుల్లా తెలిపారు.