పవన్ కల్యాణ్ కు అది అలవాటే: మంత్రి బాలినేని ఎద్దేవా
- ఒక్కో ఎన్నికలో ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకుంటారు
- గతంలో టీడీపీని తిట్టి ఇప్పుడు చంద్రబాబుతో పొత్తుకు సిద్ధమవుతున్నారు
- సీఎం పదవి లేకపోతే పవన్ చేసేది ఏమీ ఉండదన్న బాలినేని
ఒక్కో ఎన్నికకు ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకోవడం జనసేనాని పవన్ కల్యాణ్ కు అలవాటేనని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. ఒక్కో ఎన్నికకు ఒక్కొక్కరిని తిడతారని, మళ్లీ వారితోనే పొత్తుకు రెడీ అవుతారని అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీని తిట్టిన పవన్... ఇప్పుడు మళ్లీ చంద్రబాబుతో పొత్తుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. చంద్రబాబును సీఎం చేసేందుకు ఆయనతో పవన్ పొత్తు పెట్టుకోవడం ఏమిటో తనకు అర్థం కాలేదని అన్నారు. తానే సీఎం అభ్యర్థి అని పవన్ ప్రకటించుకోవాలని... ఆ తర్వాత పొత్తుల గురించి మాట్లాడాలని చెప్పారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పడం వల్ల ఉపయోగం లేదని.... పొత్తుతో అధికారంలోకి వచ్చినా, సీఎం పదవి లేకపోతే చేసేది ఏమీ ఉండదని బాలినేని అన్నారు. సొంత పార్టీని పెట్టుకున్న పవన్... వేరే పార్టీని రోడ్ మ్యాప్ అడగడం ఏమిటని ఎద్దేవా చేశారు. వవన్ ఎన్నో హామీలను ప్రకటిస్తున్నారని, సీఎం కాని పక్షంలో ఆ హామీలను ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు.