తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిన‌జీయ‌ర్ స్వామికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు

  • సమ్మక్క, సారలమ్మలపై చినజీయర్ స్వామి వ్యాఖ్య‌లు
  • క్ష‌మాప‌ణ‌లు చెప్పి తీరాల‌ని ఆందోళ‌న‌లు
  • అప్ప‌టి వ‌ర‌కు ఆందోళ‌న‌లు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం  
సమ్మక్క, సారలమ్మలపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్య‌లపై మండిప‌డ్డ‌ ప‌లువురు నేత‌లు ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రెండు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోనూ ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి.  సమ్మక్క, సారలమ్మపై చిన‌జీయ‌ర్ స్వామి చేసిన‌ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని అమ్మ‌వార్ల భ‌క్తులు డిమాండ్ చేస్తున్నారు. అప్ప‌టి వ‌ర‌కు త‌మ ఆందోళ‌న‌లు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.


More Telugu News