చినజీయర్ స్వామిపై మండిపడ్డ రేవంత్ రెడ్డి.. యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుండి తొలగించాలని డిమాండ్
- తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలు “సమ్మక్క సారలమ్మ”
- అమ్మవార్లను అవమానపరిచిన త్రిదండి చినజీయర్
- చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న రేవంత్ రెడ్డి
సమ్మక్క, సారలక్క అమ్మవార్లపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు నేతలు మండిపడుతున్నారు. తాజాగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ఓ ట్వీట్ చేశారు. చినజీయర్‌కు కేసీఆర్ గతంలో సాష్టాంగ నమస్కారం చేసిన ఫొటోను రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.
'తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన “సమ్మక్క సారలమ్మ”లను అవమానపరిచిన త్రిదండి చినజీయర్‌ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుండి తక్షణమే కేసీఆర్ తొలగించి... మన భక్తి, విశ్వాసాలపై దాడి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి' అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.