రష్యా రాకెట్ దాడిలో ప్రముఖ ఉక్రెయిన్ సినీ నటి దుర్మరణం!

  • రష్యా జరిపిన దాడిలో సినీ నటి ఒక్సానా ష్మెట్స్ మృతి
  • ఆమె నివసిస్తున్న భవనాన్ని ధ్వంసం చేసిన రష్యా రాకెట్
  • కళాకారులకు ఉక్రెయిన్ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత అవార్డును అందుకున్న ఒక్సానా
ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను ఆక్రమించుకునే దిశగా రష్యా దాడులను ముమ్మరం చేసింది. కీవ్ ను నలువైపులా చుట్టుముట్టిన రష్యా బలగాలు విచక్షణారహితంగా దాడులు చేస్తున్నాయి. రష్యా ప్రయోగిస్తున్న రాకెట్ల వల్ల ప్రజల నివాస సముదాయాలు కూడా ధ్వంసమవుతున్నాయి. తాజాగా రష్యన్ బలగాలు జరిపిన ఓ రాకెట్ దాడిలో ప్రముఖ ఉక్రెయిన్ సినీ నటి ఒక్సానా ష్వెట్స్ దుర్మరణం పాలయ్యారు. కీవ్ లో ఆమె నివసిస్తున్న భవనాన్ని రష్యన్ రాకెట్ ధ్వంసం చేసింది. 

ఈ ఘటనలో ఆమె మృతి చెందారు. ఆమె వయసు 67 సంవత్సరాలు. కళాకారులకు ఉక్రెయిన్ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ఘనత ఆమెది. ఆమె మృతి వార్త సినీ ప్రపంచాన్ని కలచివేస్తోంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా మిలిటరీ ఆపరేషన్ మొదలయింది. ఐక్యరాజ్యసమితి హైకమిషనర్ వెల్లడించిన వివరాల ప్రకారం రష్యా దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 600 మంది సాధారణ ప్రజలు చనిపోయారు. వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.


More Telugu News