ఇండియాలో 30 వేల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 2,528 కరోనా కేసులు
- దేశ వ్యాప్తంగా 149 మంది మృతి
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 29,181
ఇండియాలో కరోనా వైరస్ కట్టడిలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 2,528 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 3,997 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా.. 149 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు 29,181కి తగ్గాయి.
ఇక పాజిటివిటీ రేటు 0.40 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4,24,58,543 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే ఇప్పటి వరకు కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 5,16,281కి చేరింది. రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 78.18 కోట్ల కోవిడ్ టెస్టులు చేశారు. గత 24 గంటల్లో 6,33,867 టెస్టులు నిర్వహించారు. ఇప్పటి వరకు 180.9 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు.