ఇద్దరు పిల్లలను చెరువులో పడేసి చంపి.. తల్లి ఆత్మహత్య
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
- పిల్లల మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు
- తల్లి మృతదేహం కోసం చెరువులో గాలింపు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. తన ఇద్దరు పిల్లలను చెరువులోకి తోసేసిన ఓ మహిళ అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. గంభీరావుపేట మండలం కొత్తపల్లిలోని చెరువులో పిల్లలను పడేసిన తర్వాత, ఆమె దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చెరువులో నుంచి ఐదేళ్ల అన్షిక, మూడేళ్ల అభిగ్న మృతదేహాలను వెలికితీశారు. అయితే, తల్లి రేఖ మృతదేహం ఇంకా లభించలేదు. చెరువులో గజ ఈతగాళ్లతో గాలింపు కొనసాగుతోంది. ఆ మహిళ ఈ ఘటనకు పాల్పడడానికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.