ఏప్రిల్ 1 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి.. 20న టికెట్ల విడుదల
- కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం భక్తులకు అనుమతి రద్దు
- కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి అనుమతి
- మూడు రోజులపాటు టికెట్లు అందుబాటులో
- ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టికెట్ల కేటాయింపు
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడాన్ని టీటీడీ ఆపేసింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆర్జిత సేవలకు తిరిగి భక్తులను అనుమతించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన టికెట్లను ఈ నెల 20న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తెలిపింది. తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్ (tirupatibalaji.ap.gov.in) వెబ్‌సైట్ ద్వారా భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు సేవలకు సంబంధించిన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. టికెట్లు దక్కించుకున్న వారి వివరాలను 22న ఉదయం 10 గంటల తర్వాత వెబ్‌సైట్‌లో పెడతారు. ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టికెట్లను కేటాయిస్తారు. అలాగే, శ్రీవారి గర్భాలయంలో మూలమూర్తిని దర్శించుకున్న భక్తులకు ఆలయ ఆవరణలోనే తీర్థం, శఠారి అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో గతంలో దీనిని రద్దు చేశారు.