గ్యాస్ బుకింగ్, చెల్లింపుల కోసం బీపీసీఎల్ నుంచి వాయిస్ ఆధారిత సేవలు.. తొలి కంపెనీగా రికార్డు
- గ్రామీణ ఎల్పీజీ వినియోగదారులకు గ్యాస్ బుకింగ్ ఇక సులభతరం
- యూపీఐ 123పే ద్వారా చెల్లింపులు
- 08045163554కు ఫోన్ చేస్తే సరి
స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం లేని గ్రామీణ ఎల్పీజీ వినియోగదారుల కోసం భారత పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) సరికొత్త సేవలు ప్రారంభించింది. గ్యాస్ బుక్ చేసుకోవడానికి, ‘యూపీఐ 123పే’ ద్వారా చెల్లింపుల కోసం వాయిస్ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని ఉపయోగించి వినియోగదారులు గ్యాస్‌ను బుక్ చేసుకోవడంతో పాటు చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అల్ట్రాక్యాష్ టెక్నాలజీస్‌తో జట్టుకట్టినట్టు బీపీసీఎల్ తెలిపింది.
భారత్ గ్యాస్ వినియోగదారులు తమ ఫోన్ నుంచి 08045163554 నంబరుకు ఫోన్ చేసి గ్యాస్ బుకింగ్, చెల్లింపులు చేసుకోవచ్చు. ‘యూపీఐ 123పే’ని ఉపయోగించి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి పెట్రోలియం సంస్థగా బీపీసీఎల్ రికార్డులకెక్కింది.