పాల‌న‌లో భాగ‌స్వామం కండి.. నిరుద్యోగుల‌కు క‌విత పిలుపు

  • తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క‌విత హోలీ గ్రీటింగ్స్‌
  • ఆర్గానిక్ క‌ల‌ర్స్ వాడాల‌ని సూచ‌న‌
  • నిరుద్యోగుల‌కు ఉత్సాహం నింపుతూ స‌రికొత్త పిలుపు
తెలంగాణ నిరుద్యోగుల‌కు టీఆర్ఎస్ నేత‌, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత వినూత్న స‌ల‌హా ఇచ్చారు. ఇటీవ‌లే రాష్ట్రంలో 80 వేల పై చిలుకు ఉద్యోగాల భ‌ర్తీకి సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యాన్ని గుర్తు చేసిన ఆమె.. ఉద్యోగ నియామక‌ ప‌రీక్ష‌లపై శ్ర‌ద్ధ పెట్ట‌డంతో ఉద్యోగాల‌ను సాధించి ప్ర‌భుత్వ పారిపాల‌న‌లో భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు. 

శ్రద్ధ పెట్టి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పరిపాలనలో భాగస్వామ్యం అవ్వండి అంటూ ఆమె ఇచ్చిన పిలుపు నిరుద్యోగుల్లో స‌రికొత్త ఉత్సాహం నింప‌నుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు హోలీ శు‌భాకాంక్ష‌లు తెలుపుతూ ఓ వీడియో విడుద‌ల చేసిన క‌విత‌.. అందులోనే నిరుద్యోగుల‌కు ఈ పిలుపు ఇచ్చారు. హోలీ సంతోషంగా నిర్వ‌హించుకోవాల‌ని, ఆర్గానిక్ రంగుల‌నే వినియోగించాల‌ని ఆమె రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కోరారు.


More Telugu News