ర‌ష్యా ధిక్కార స్వ‌రం.. ఐసీజే ఆదేశాలు బేఖాత‌రు

  • యుద్ధాన్ని త‌క్ష‌ణ‌మే ఆపాల‌న్న ఐసీజే
  • ఐసీజే తీర్పును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోబోమ‌న్న ర‌ష్యా
  • తీర్పు అమ‌లుకు ఉక్రెయిన్ కూడా అంగీక‌రించాల‌ని మెలిక‌
ఉక్రెయిన్‌ను త‌మ వ‌శం చేసుకోవాల‌న్న కాంక్ష‌తో సాగుతున్న ర‌ష్యా... ఆ మార్గంలో చాలా దూకుడుగానే సాగుతోంద‌ని చెప్పాలి. త‌క్ష‌ణ‌మే యుద్ధం ఆపేయాల‌ని బుధ‌వారం నాడు అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ఇంట‌ర్నేష‌న‌ల్ కోర్టు ఆఫ్ జ‌స్టిస్ (ఐసీజే) ఇచ్చిన ఆదేశాల‌ను ర‌ష్యా తిర‌స్క‌రించింది. ఐసీజే నిర్ణ‌యాన్ని తాము ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేమ‌ని ర‌ష్యా అధ్య‌క్ష భ‌వ‌నం క్రెమ్లిన్ అధికార ప్ర‌తినిధి దిమిత్రి పెస్కోవ్ గురువారం నాడు తేల్చి చెప్పారు.

బుధ‌వారం ఐసీజేలో ర‌ష్యా, ఉక్రెయిన్‌ల మ‌ధ్య సాగుతున్న యుద్ధంపై చ‌ర్చ జ‌ర‌గ‌గా.. మెజారిటీ దేశాలు ర‌ష్యా యుద్ధాన్ని ఆపేయాల్సిందేన‌ని తేల్చి చెప్పాయి. ఐసీజేలో భార‌త ప్ర‌తినిధి కూడా ఈ మాట‌నే వెల్ల‌డించారు. దీంతో యుద్ధాన్ని ర‌ష్యా త‌క్ష‌ణ‌మే నిలిపివేయాలంటూ ఐసీజే ఆదేశాలు జారీ చేసింది. ఐసీజే ఆదేశాల‌ను తాజాగా బేఖాత‌రు చేసిన ర‌ష్యా.. ఐసీజే తీర్పును ర‌ష్యాతో పాటు ఉక్రెయిన్ కూడా అంగీక‌రించాల్సి ఉంటుంద‌ని పేర్కొంది.


More Telugu News