రష్యా ముడిచమురు కొనరాదని భావిస్తున్న రిలయన్స్!

  • ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
  • రష్యాపై కఠిన ఆంక్షలు విధించిన ప్రపంచదేశాలు
  • చవకగా రష్యా చమురు
  • అయినప్పటికీ దూరంగా ఉంటామన్న రిలయన్స్!
ఉక్రెయిన్ పై దండయాత్ర నేపథ్యంలో రష్యాపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆంక్షలు విధించగా, ఇదే సమయంలో భారత్ చవకగా రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం తెలిసిందే. ఫిబ్రవరి 24 నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) రష్యా నుంచి 3 మిలియన్ బ్యారెళ్ల చమురు కొనుగోలు చేయగా, హిందుస్థాన్ పెట్రోలియం టెండర్ల ద్వారా 2 మిలియన్ బ్యారెళ్లు దక్కించుకుంది. 

అయితే, చవకగా లభించే అవకాశం ఉన్నప్పటికీ రష్యా నుంచి ముడిచమురును కొనరాదని రిలయన్స్ సంస్థ భావిస్తోంది. రిలయన్స్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. ఇప్పుడీ కర్మాగారాలకు కావాల్సిన చమురును రష్యా నుంచి తీసుకోబోమని రిలయన్స్ వర్గాలంటున్నాయి. రష్యా నుంచి తాము చమురును కొనుగోలు చేసే మార్గాలు అందుబాటులోనే ఉన్నా, ఆంక్షల కారణంగా దూరంగా ఉండక తప్పదని రిలయన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ రాజేశ్ రావత్ తెలిపారు. 

రిలయన్స్ తన రిఫైనరీలు, పెట్రోకెమికల్ సంస్థలకు అవసరమైన ముడిచమురును రష్యా నుంచి, మధ్య ప్రాచ్య దేశాలు, అమెరికా నుంచి కొనుగోలు చేస్తుంది.


More Telugu News