గేట్-2022లో టాప్ ర్యాంకు మనోడిదే!
- నిట్ విద్యార్థికి టాప్ ర్యాంకు
- కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్న మణి సందీప్ రెడ్డి
- మెటలర్జికల్ విభాగంలో నిరంజన్‌కు తొమ్మిదో ర్యాంకు
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్-2022)లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. గురువారం విడుదలైన గేట్ ఫలితాల్లో ఆలిండియా టాప్ ర్యాంకును తెలంగాణకు చెందిన మణి సందీప్ రెడ్డి కైవసం చేసుకున్నాడు. వరంగల్‌లోని నిట్‌లో కెమికల్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సందీప్ రెడ్డిని నిట్ సంచాలకులు రమణారావు ప్రత్యేకంగా అభిందించారు.
ఇదిలా ఉంటే.. మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలేనికి చెందిన మరో విద్యార్థి తన్నీరు నిరంజన్‌కు మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో 9 వ ర్యాంకు దక్కింది. ఇటీవలి కాలంలో గేట్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటుతున్నా.. ఈ దఫా ఏకంగా ఆలిండియా ఫస్ట్ ర్యాంకు తెలుగు విద్యార్థికి దక్కడం గమనార్హం.