రైల్వేను ప్రైవేటీకరిస్తున్నారని ఎంపీల ఆరోపణలు... వివరణ ఇచ్చిన కేంద్రం
- రైల్వేల ప్రైవేటీకరణపై ప్రచారం
- లోక్ సభలో లేవనెత్తిన పలువురు ఎంపీలు
- రైల్వేల ప్రైవేటీకరణ ఆలోచనే లేదన్న అశ్విని వైష్ణవ్
- ఊహాజనిత ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు
దేశంలో ఇటీవల కాలంలో ప్రైవేటీకరణ మాట ఎక్కువగా వినిపిస్తోంది. పలు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరణ చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవడమే అందుకు కారణం. తాజాగా, భారతీయ రైల్వేను కూడా ప్రైవేటుపరం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, కొందరు ఎంపీలు ఈ అంశాన్ని లోక్ సభలో లేవనెత్తారు. బడ్జెట్ లో రైల్వే శాఖ కేటాయింపులపై చర్చ సందర్భంగా ఎంపీలు దీనిపై మాట్లాడారు.
రైల్వేల ప్రైవేటీకరణకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆరోపించారు. ఎంపీల వ్యాఖ్యలకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరణ ఇచ్చారు. రైల్వేలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. రైల్వే వ్యవస్థలో రైళ్లు, ట్రాక్ లు, రైల్వే స్టేషన్లు, ఇంజిన్లు, బోగీలు అన్నీ ప్రభుత్వ ఆస్తులేనని వివరించారు. రైల్వేను కేంద్రం ప్రైవేటీకరిస్తోందన్న ఆరోపణలు విపక్షాల ఊహాజనితమేనని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఆ విషయంలో తాము ఎలాంటి ప్రణాళికలు రచించడంలేదని తెలిపారు.