కశ్మీర్ ఫైల్స్ విమర్శకులకు చేతన్ భగత్ చురక!

  • భావప్రకటన స్వేచ్ఛ కావాలంటారు
  • కానీ కశ్మీర్ ఫైల్స్ లో దాన్ని చూపించొద్దంటారు
  • ఫన్నీ అంటే ఇదేనంటూ చేతన్ వ్యాఖ్య
  • చిత్రాన్నిమెచ్చుకుంటూ పోస్ట్ 
సమాజంలో విరుద్ధ అభిప్రాయాలతో ఉండే వారిని ప్రముఖ రచయిత చేతన్ భగత్ విమర్శించారు. కశ్మీర్ లో పండిట్లు, హిందువులపై జరిగిన అకృత్యాలు, ఊచకోతలను యావత్ ప్రపంచానికి తెలియజెప్పే లక్ష్యంతో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీసిన సినిమాకు దేశవ్యాప్తంగా చక్కని ఆదరణ లభిస్తుండడం తెలిసిందే. దీన్ని కొందరు తప్పుబడుతున్నారు. అలా తప్పుబట్టే వారిని చేతన్ భగత్ నిలదీశారు.

‘‘ఫన్నీ (నవ్వులాట) ఏంటంటే.. భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి తరచూ అడిగేవారే కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి వచ్చే సరికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు’’ అని చేతన్ భగత్ తన ట్విట్టర్ పేజీలో అభిప్రాయం పోస్ట్ చేశారు. ఈ సినిమాను మెచ్చుకుంటూ కొన్ని రోజుల క్రితం కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ సైతం దీన్ని మెచ్చుకున్నారు. 

మరోవైపు ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టుకుంటోంది. రూ.100 కోట్లకు చేరువ అవుతోంది. బుధవారం ఒక్క రోజే రూ.19 కోట్లు రావడంతో మొత్తం రూ.78 కోట్లను వసూలు చేసుకుంది. శుక్రవారం నాటికి రూ.100 కోట్ల మార్క్ కు కలెక్షన్లు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.


More Telugu News