ప్రణతి పుట్టినరోజు నాడు.. నేను, చరణ్ అర్ధరాత్రి షికారుకెళ్లిపోతాం: తారక్
- ఈ విషయం నాకు, చెర్రీకి తప్ప ప్రపంచానికి తెలియదు
- నన్ను విమర్శించేది ఇద్దరే వ్యక్తులు
- ఒకరు మా నాన్న హరికృష్ణ.. ఇంకొకరు రాజమౌళి
- తానీ స్థాయిలో ఉన్నానంటే రాజమౌళి చలవేనన్న తారక్
ఆర్ఆర్ఆర్ సినిమా మరో వారంలో విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచేసింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి.. తారక్, రామ్ చరణ్, రాజమౌళిలను ఇంటర్వ్యూ చేశారు. సరదా ప్రశ్నలు అడిగారు. అరగంటపాటు సాగిన చిట్ చాట్ లో.. తారక్ పంచ్ లు, ఆయన చెప్పిన విషయాలే హైలైట్ గా నిలిచాయి.
నెట్టింట్లో ఆ విషయాలు వైరల్ అయ్యాయి. చరణ్ తో తనకున్న అనుబంధాన్ని ఆయన వివరించారు. చరణ్ తో ఎన్నో ఏళ్ల నుంచి స్నేహబంధం ఉందని అన్నారు. ఈ విషయాన్ని ఇద్దరం ఎప్పుడూ బయటపెట్టలేదని చెప్పారు. చరణ్ బయటకు సైలెంట్ గానే ఉన్నా.. లోలోపల మాత్రం అగ్నిపర్వతం బద్దలైపోతున్నట్టు ఉంటుందని తెలిపారు. అదే తనకు బాగా నచ్చిందన్నారు.
‘‘నా శ్రీమతి ప్రణతి పుట్టిన రోజు మార్చి 26. ఆ రోజు అర్ధరాత్రి 12 దాటగానే (మార్చి 27) నేను ఇంటి గేటు దగ్గర నిలబడతాను. ఆ వెంటనే చరణ్ కారొచ్చేస్తుంది. మేమిద్దరం బయటకు రయ్యిన దూసుకెళ్లిపోతాం. ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది’’ అని చెప్పారు. ఈ విషయం తమకు తప్ప ప్రపంచానికి తెలియదని అన్నారు.
తనను ఓపెన్ గా విమర్శించే వ్యక్తులు ఇద్దరేనని, ఒకరు తన తండ్రి హరికృష్ణ అయితే, ఇంకొకరు రాజమౌళి అని తారక్ చెప్పుకొచ్చారు. తాను నటుడిగా ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం రాజమౌళేనని అన్నారు. అంతేగాకుండా సెట్ లో రాజమౌళి ఎలా ఉంటారో అనుకరించి చూపించారు. వల్లి, రమా రాజమౌళి, కార్తికేయలతో తాను ఎలా మాట్లాడేది కూడా అభినయించి చూపించారు.