టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం దారుణం: వర్ల రామయ్య
- శాసనసభా గౌరవాన్ని ఈ ప్రభుత్వం దిగజార్చింది
- గతంలో ఏ ప్రభుత్వం ఇంతలా దిగజార్చలేదు
- ప్రజా సంక్షేమం కోసం చట్టాలు చేసే దేవాలయం శాసనసభ
- తమ పార్టీ కార్యాలయంగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్న రామయ్య
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీ నేతల సస్పెన్షన్ పై ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ తీరు దారుణమని విమర్శలు గుప్పించారు.
'శాసనసభా గౌరవాన్ని ఈ ప్రభుత్వం దిగజార్చినట్లు గతంలో ఏ ప్రభుత్వం దిగజార్చలేదు. ప్రజా సంక్షేమం కోసం చట్టాలు చేసే దేవాలయం లాంటి శాసనసభను తమ పార్టీ కార్యాలయంగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. ప్రభుత్వ అవినీతి, అసమర్థతను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతల నోళ్లు నొక్కడం, సస్పెండ్ చేయడం దారుణం' అని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.