హైదరాబాద్‌లో బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష షురూ
- రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
- నియంతృత్వాన్ని కొల్లగొట్టాలి
- అసెంబ్లీలోకి అనుమతించాలి
- టీఆర్ఎస్‌పై బీజేపీ నేతల ఫైర్
హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ తెలంగాణ నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు దిగారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, నియంతృత్వాన్ని కొల్లగొట్టాలని నినదిస్తున్నారు. బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావుతో పాటు పలువురు నేతలు ఈ దీక్షలో పాల్గొన్నారు.
అసెంబ్లీలోకి తమను అనుమతించే అంశాన్ని పరిశీలించాని హైకోర్టు సూచన చేసినప్పటికీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దాన్ని తిరస్కరించడాన్ని నిరసిస్తూ దీక్ష చేపడుతున్నట్లు బీజేపీ నేతలు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య సంప్రదాయాలను తుంగలో తొక్కుతోందని వ్యాఖ్యానించారు.
కాగా, మొదట బీజేపీ నేతల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. చివరకు బీజేపీ నేతలు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని ఈ దీక్ష చేపట్టారు. బీజేపీ దీక్ష దృష్ట్యా ఇందిరా పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.