అసెంబ్లీలో ఫోన్‌లో రికార్డింగ్‌లు చేయకూడదు: టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ రూలింగ్
- టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగింపు
- అసెంబ్లీలో సభ్యుల మొబైళ్లకు అనుమతి లేదన్న స్పీకర్
- సభా సంప్రదాయాలను పాటించాలని వినతి
- 11 మంది టీడీపీ సభ్యులపై సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. అసెంబ్లీలో సభ్యుల మొబైళ్లకు అనుమతి లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. సభా సంప్రదాయాలను పాటించాలని, చర్చలకు సహకరించి హుందాగా మెలగాలని అన్నారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై రూలింగ్ ఇచ్చారు.
ఫోన్‌లో రికార్డింగ్‌లు చేయకూడదని తెలిపారు. శాసన సభలో టీడీపీ నేతలు ఆందోళన కొనసాగించడంతో 11 మంది టీడీపీ సభ్యులపై ఒకరోజు సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. వారిలో సత్యప్రసాద్, చినరాజప్ప, రామ్మోహన్, అశోక్, సాంబశివరావు, గొట్టిపాటి రవి, రామరాజు, గణబాబు, భవానీ, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ ఉన్నారు.
అంతకు ముందు సభలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ... గిరిజనుల కోసం తమ ప్రభుత్వం 31 పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. అమ్మ ఒడి పథకం కింద 2,86,379 మందికి గిరిజన మహిళలకు రూ.843,80 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... తూర్పు గోదావరి జిల్లాలోని తీర ప్రాంతాల్లో రూ.1,650 కోట్లతో తాగునీటి సరాఫరా ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. స్థిరమైన తాగునీటి వనరులో ఉప్పునీటి సాంద్రత సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆమోదం తెలిపినట్లు వివరించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 1.35 లక్షల కార్యదర్శులు, 2.65 లక్షల వాలంటీర్లలకు, మొత్తం 4 లక్షల మందికి ఏక కాలంలో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. జగనన్న తోడు పథకం కింద ఇప్పటివరకు 3 విడతలుగా చెల్లింపులు చేశామని వివరించారు. అలాగే, వైఎస్సార్ బీమా పథకం కింద ఇప్పటి వరకు రూ.129.90 కోట్లు ఇచ్చామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.