ఉక్రెయిన్‌కు మ‌రిన్ని ఎయిర్‌క్రాఫ్టులు, ఆయుధాలు, డ్రోన్లు అందిస్తాం: బైడెన్

  • ఉక్రెయిన్‌కు 800 మిలియ‌న్ డాల‌ర్ల సైనిక సాయం ప్ర‌క‌ట‌న‌
  • పుతిన్‌ను యుద్ధ నేర‌స్థుడిగా అభివ‌ర్ణించిన బైడెన్‌
  • అంత‌ర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగ‌తించిన‌ అమెరికా
ఉక్రెయిన్, ర‌ష్యా మ‌ధ్య కొన‌సాగుతున్న యుద్ధం నేపథ్యంలో..  ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాల సాయం చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌కు మ‌రింత సాయం చేస్తామ‌ని తెలిపారు. ఉక్రెయిన్‌కు మ‌రిన్ని ఎయిర్‌క్రాఫ్టులు, ఆయుధాలు, డ్రోన్లు అందిస్తామ‌ని చెప్పారు.

అంతేగాక‌, ఉక్రెయిన్‌కు 800 మిలియ‌న్ డాల‌ర్ల సైనిక సాయాన్ని అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌ను బైడెన్ యుద్ధ నేర‌స్థుడిగా మ‌రోసారి అభివ‌ర్ణించారు. ఉక్రెయిన్‌పై అంత‌ర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమెరికా స్వాగతించింది. అంత‌ర్జాతీయ న్యాయ‌స్థాన తీర్పును ర‌ష్యా గౌర‌వించాల‌ని సూచించింది.


More Telugu News