ఇజ్రాయెల్ లో సరికొత్త కరోనా వేరియంట్ గుర్తింపు
- పలు దేశాల్లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- ఇజ్రాయెల్ లో ఒమిక్రాన్ కు చెందిన కొత్త వేరియంట్ గుర్తింపు
- ఈ వేరియంట్ వల్ల ముప్పు ఉండకపోవచ్చన్న ఇజ్రాయెల్
తగ్గినట్టే తగ్గిన కరోనా మహమ్మారి మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. పలు దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ లో కరోనా కొత్త వేరియంట్ ను గుర్తించారు. ఒమిక్రాన్ కు చెందిన రెండు ఉపవేరియంట్లు బీఏ.1, బీఏ.2 లను కొత్త వేరియంట్ కలిగి ఉందని ఇజ్రాయెల్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఈరోజు తెలిపింది.
బెన్ గురియన్ విమానాశ్రయానికి చేరిన ఇద్దరు ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. ఈ వేరియంట్ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి లక్షణాలు ఉన్నాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే ఈ వేరియంట్ వల్ల ముప్పు ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ కరోనా ప్రతిస్పందన విభాగం చీఫ్ సల్మాన్ జర్కా తెలిపారు. అందువల్ల ఈ వేరియంట్ వ్యాప్తి, కేసుల గురించి ఆందోళన చెందడం లేదని చెప్పారు.