హర్భజన్ సింగ్ ను రాజ్యసభకు పంపనున్న ఆప్?
- స్పిన్ బౌలింగ్‌లో సత్తా చాటిన పంజాబీ
- టీమిండియాకు సుదీర్ఘ సేవలు
- గతేడాది అన్ని ఫార్మాట్లకు గుబ్ బై
- రాజకీయ ఎంట్రీపై అస్పష్టత
పంజాబ్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టిన సామాన్యుల పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఓ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్, స్పిన్ బౌలింగ్ దిగ్గజం హర్భజన్ సింగ్‌ను రాజ్యసభకు పంపే దిశగా ఆ పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో ఓ ఆసక్తికర కథనం ప్రచురితమైంది.
పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన హర్భజన్... 1998 నుంచి 2016 వరకు భారత క్రికెట్ జట్టు సభ్యుడిగా కొనసాగాడు. భారత్ తరఫున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడిన భజ్జీ.. ఐపీఎల్‌లో 163 మ్యాచ్‌లు ఆడాడు. గతేడాది డిసెంబర్‌లో క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భజ్జీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడని వార్తలు వినిపించాయి. తనకు కూడా పంజాబ్‌కు సేవ చేయాలని ఉందని చెప్పిన భజ్జీ.. రాజకీయాల్లోకి వచ్చేటట్టు ఉంటే తానే ప్రకటిస్తానని చెప్పాడు. అయితే అతడి నుంచి ఆ దిశగా ఇప్పటిదాకా రాజకీయ ఎంట్రీపై ప్రకటన అయితే రాలేదు.
దాదాపుగా అన్ని పార్టీలతోనూ అతడికి మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ క్రమంలో పంజాబ్‌లో ఆప్ ఘన విజయం సాధించిందన్న వార్తలు రాగానే భజ్జీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, భగవంత్ కు కంగ్రాట్స్ కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలో భజ్జీని రాజ్యసభకు పంపే దిశగా ఆప్ నిర్ణయం తీసుకోనుందనే వార్తలు రావడం విశేషం.