తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వికాస్ రాజ్ నియామకం
- 1992 కేడర్ ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్
- ఇన్నాళ్లూ జీఏడీ ముఖ్య కార్యదర్శిగా కొనసాగిన వైనం
- శశాంక్ గోయల్ బదిలీతో తెలంగాణ సీఈఓగా వికాస్
- కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల జారీ
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) పోస్టు గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటిదాకా ఆ పోస్టులో కొనసాగిన శశాంక్ గోయల్ ఇదివరకే బదిలీ కాగా.. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్‌ను తెలంగాణ రాష్ట్రఎన్నికల ప్రధాన అధికారిగా నియమిస్తూ కేంద్ర ఎన్నిల సంఘం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వికాస్ రాజ్.. ఉమ్మడి ఏపీలో కర్నూలు కలెక్టర్‌గా, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా కీలక బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేడర్‌ను ఎంచుకున్న ఆయన ఇన్నాళ్లూ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శిగా కొనసాగారు.