ఫేస్ బుక్ జోక్యానికి ముగింపు పలకాలి: సోనియాగాంధీ
- ఎన్నికల సమయంలో ఫేస్ బుక్ జోక్యానికి ముగింపు పలకాలి
- బీజేపీతో ఫేస్ బుక్ తక్కువ ధరకే డీల్స్ కుదుర్చుకుంది
- పార్టీల ప్రచారాల విషయంలో ఫేస్ బుక్ పక్షపాతం వహిస్తోంది
సోషల్ మీడియాపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల ప్రచారం విషయంలో ఫేస్ బుక్ పక్షపాతం వహిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఫేస్ బుక్ జోక్యానికి ముగింపు పలకాలని అన్నారు. లోక్ సభలో జీరో అవర్లో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రకటనల కోసం బీజేపీతో ఫేస్ బుక్ తక్కువ ధరకే డీల్స్ కుదుర్చుకుందంటూ అల్ జజీరాలో వచ్చిన కథనాలను ఆమె ప్రస్తావించారు. పార్టీల ప్రచారాల విషయంలో ఫేస్ బుక్ పక్షపాతం వహిస్తోందని అన్నారు. ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావానికి ముగింపు పలకాలని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు.