రాష్ట్రపతి ఎన్నికపై బీజేపీకి దీదీ స్ట్రాంగ్ కౌంటర్
- త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు
- తాజా ఎన్నికల ఫలితాలతో జోష్‌లో బీజేపీ
- గేమ్ అప్పుడే ముగియలేదని దీదీ చురకలు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో అధికార పగ్గాలను దక్కించుకున్న బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టి కౌంటర్ ఇచ్చారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలను ప్రస్తావించిన దీదీ.. గేమ్ అప్పుడే ముగియలేదంటూ చురకలు అంటించారు. ఈ మేరకు బుధవారం బీజేపీని ఉద్దేశించి దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు లేకుండా బీజేపీ విజయం సాధించలేదని దీదీ ఆసక్తికర కామెంట్ చేశారు. రాష్ట్రపతి ఎన్నిక బీజేపీకి అంత ఈజీ ఏమీ కాదన్న దీదీ..ఆ విషయం బీజేపీకి కూడా తెలుసునని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల్లో మెజారిటీ శాతం మంది ఇతర పార్టీలకు చెందిన వారేనని గుర్తు చేసిన దీదీ.. దేశంలోని ఎమ్మెల్యేల్లో బీజేపీకి సగం మంది ఎమ్మెల్యేలు కూడా లేరని చురక అంటించారు. వెరసి రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలవాలంటే తమ మద్దతు తీసుకోక తప్పని పరిస్థితి బీజేపీకి ఎదురు కానుందని ఆమె వ్యాఖ్యానించారు.