సీఎం సీట్లో భగవంత్!.. ఆఫీస్‌లో భగత్ సింగ్, అంబేద్కర్ ఫొటోలు మాత్రమే!
- పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మాన్
- తన ఛాంబర్‌లో భగత్ సింగ్, అంబేద్కర్ ఫొటోలు మాత్రమే
- ముందే ప్రకటించిన భగవంత్ మాన్
ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ బుధవారం మధ్యాహ్నం పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామం ఖత్కర్ కలాన్‌లో ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన భగవంత్.. ఛండీగఢ్‌లోని పంజాబ్ సివిల్ సెక్రటేరియట్‌కు చేరుకున్నారు. సెక్రటేరియట్‌లోని సీఎం ఛాంబర్‌లోకి ప్రవేశించిన మాన్.. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా సీఎం ఛాంబర్‌లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. భగవంత్ మాన్ సీటు వెనుక గోడలపై భగత్ సింగ్ ఫొటోతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటో మాత్రమే కనిపించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలో ఆప్ విజయం ఖరారైన మరుక్షణమే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మాన్.. తన కార్యాలయంలో భగత్ సింగ్, అంబేద్కర్ ఫొటోలు మాత్రమే ఉంటాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకే తన కార్యాలయంలో వారిద్దరి ఫొటోలు మినహా మరే ఫొటోను కూడా మాన్ అనుమతించకపోవడం గమనార్హం.