రైల్వేల్లో హైదరాబాద్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే: ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్
- హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం
- దేశంలోని పెద్ద నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి
- క్వాడ్రిలేటరల్, డయాగోనల్ రూట్లలో హైదరాబాద్‌కు చోటు లేదు
- తప్పనిసరిగా ఒకదానిలో చేర్చాలన్న ఉత్తమ్
భాగ్యనగరి హైదరాబాద్‌కు రైల్వే ప్రాజెక్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు నేడు లోక్ సభ సమావేశాల్లో ఈ అంశాన్ని ఉత్తమ్ ప్రస్తావించారు.
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటని పేర్కొన్న ఉత్తమ్.. నగరానికి సంబంధించి రైల్వే ప్రాజెక్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైల్వే శాఖ ప్రతిపాదించిన క్వాడ్రిలేటర్, డయాగోనల్ రూట్లలో హైదరాబాద్ లేదని, దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్‌ను ఈ రెండు రూట్లలో దేనిలోనో ఒకదానిలో చేర్చాలని ఆయన కోరారు.