వివేకా హత్య కేసులో గంగిరెడ్డికి ఊరట.. బెయిల్ రద్దు కుదరదన్న హైకోర్టు
- వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఎర్ర గంగిరెడ్డి
- సీబీఐ అరెస్ట్ చేయగా..బెయిల్ తెచ్చుకున్న గంగిరెడ్డి
- బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో సీబీఐ పిటిషన్
- పిటిషన్‌ను కొట్టేస్తూ హైకోర్టు నిర్ణయం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న ఎర్ర గంగిరెడ్డికి బుధవారం భారీ ఊరట లభించింది. గంగిరెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం ఏపీ హైకోర్టు కొట్టివేసింది.
వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన గంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్‌పై బయటే ఉన్నారు. కేసు కీలక దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో కీలక నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి బయట ఉంటే.. సాక్షులు ప్రభావితం అయ్యే ప్రమాదముందని భావించిన సీబీఐ ఆయన బెయిల్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగ్గా.. గంగిరెడ్డికి వ్యతిరేకంగా పలువురు స్టేట్ మెంట్ ఇచ్చారని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఏ ఒక్కరినీ గంగిరెడ్డి బెదిరించినట్లుగా సాక్ష్యాలు లేవని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనను విన్న కోర్టు గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టేసింది.