వ‌న్డేల్లో 250 వికెట్లు సాధించిన తొలి మ‌హిళా క్రికెట‌ర్‌గా జుల‌న్‌ గోస్వామి

  • 199 వ‌న్డేలు ఆడిన జుల‌న్‌
  • ఇప్ప‌టికే అత్య‌ధిక వికెట్లు సాధించిన బౌల‌ర్‌గా గుర్తింపు
  • తాజాగా 250 మార్కును చేరుకున్న జుల‌న్‌
టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ జుల‌న్ గోస్వామి వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో అరుదైన రికార్డును కైవసం చేసుకుంది. మ‌హిళా క్రికెట్‌కు సంబంధించి వ‌న్డేల్లో 250 వికెట్లు సాధించిన తొలి క్రికెట‌ర్‌గా ఆమె నిలిచింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఉమెన్ క్రికెట్ క‌ప్‌లో భాగంగా బుధ‌వారం ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఓ వికెట్ ప‌డ‌గొట్టిన జుల‌న్‌.. ఈ ఘ‌న‌త‌ను సాధించింది. 

ఇప్ప‌టిదాకా 199 వ‌న్డే మ్యాచ్‌లు ఆడిన జుల‌న్ 250 వికెట్లు ప‌డ‌గొట్టి ఎక్కువ వికెట్లు తీసుకున్న మ‌హిళా క్రికెట‌ర్‌గా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. జుల‌న్ త‌ర్వాత స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట‌ర్ ఫిట్జ్ ప్యాట్రిక్ (180 వికెట్లు), వెస్టిండిస్ బౌల‌ర్ అనిసా మ‌హ‌మ్మ‌ద్ (180 వికెట్లు) ఉన్నారు. జుల‌న్ సాధించిన ఘ‌న‌త‌ను కీర్తిస్తూ ఐసీసీ ఓ ట్వీట్ చేసింది.


More Telugu News