బెల్లంకొండకు సారీ చెప్పిన ఫైనాన్షియర్
- బెల్లంకొండ రూ.85 లక్షలు తీసుకున్నారన్న శరణ్
- కోర్టు ఆదేశంతో బెల్లంకొండపై సీసీఎస్ పోలీసు కేసు
- సమాచార లోపంతోనే వివాదం నెలకొందన్న శరణ్
- బెల్లంకొండపై కేసును వాపస్ తీసుకున్నవైనం
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్, ఆయన తనయుడు, యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఫైనాన్షియర్ శరణ్ కుమార్ క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా బెల్లంకొండ సురేశ్‌పై సీసీఎస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును కూడా ఆయన వెనక్కు తీసుకున్నారు. బెల్లంకొండ మేనేజర్లు, తన అకౌంట్స్ సిబ్బంది మధ్య నెలకొన్న సమాచార లోపం కారణంగానే తాను వారిపై కేసు పెట్టానని శరణ్ కుమార్ తెలిపారు.
ఈ మేరకు బుధవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన శరణ్ కుమార్ బెల్లంకొండ సురేశ్, సాయి శ్రీనివాస్‌లపై పెట్టిన కేసును వాపస్ తీసుకున్నారు. ఓ చిత్ర నిర్మాణం కోసమంటూ తన వద్ద రూ.85 లక్షలు తీసుకున్న బెల్లంకొండ సురేశ్ వాటిని తిరిగి ఇవ్వడం లేదంటూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో సీసీఎస్ పోలీసులు బెల్లంకొండ సురేశ్‌పై కేసు నమోదు చేశారు. తాజాగా శరణ్ కుమార్ ఆ ఫిర్యాదును వెనక్కు తీసుకోవడంతో ఈ వివాదం ముగిసినట్టయింది.