మహారాష్ట్రలో రూ.5 కోట్లకు పెరిగిన ఏసీడీపీ నిధులు
- ఎంపీ ల్యాడ్స్ మాదిరే ఏసీడీపీ నిధులు
- ఎమ్మెల్యేలకు కేటాయిస్తున్న ప్రభుత్వాలు
- ఇప్పటిదాకా మహారాష్ట్రలో రూ.4 కోట్లుగా ఏసీడీపీ నిధులు
- వాటిని రూ.5 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల (ఏసీడీపీ)ను మహారాష్ట్ర ప్రభుత్వం పెంచింది. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యేలకు ఏటా కొంత మొత్తం నిధులను కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఎంపీ ల్యాడ్స్ మాదిరే ఈ ఏసీడీపీ నిధులతో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను చేపడతారు. ఈ మొత్తాన్ని ఇప్పటిదాకా రూ.4 కోట్లుగా ఉంటే.. మహారాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.5 కోట్లకు పెంచింది.
ఈ మేరకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం నాడు అసెంబ్లీలో ప్రకటించారు. రూ.1 కోటి మేర పెరిగిన ఈ నిధులు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరింత మేర అభివృద్ధి పనులు జరిగేందుకు దోహదపడనున్నాయని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.