చెత్త పన్ను చెల్లించనందుకు షాపుల ముందు చెత్త పారబోసిన మునిసిపల్ సిబ్బంది
- కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద ఘటన
- చెత్త పన్ను వసూలుకు వెళ్లిన సిబ్బంది
- చెత్త పన్నును ఎందుకు చెల్లించాలన్నదుకాణ దారులు
- దుకాణాల ముందు చెత్తను పారబోసిన సిబ్బంది
ఏపీలో కొత్తగా ఇటీవల చెత్త పన్ను వసూలును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం నాడు సదరు పన్ను వసూలు కోసం వెళ్లిన కర్నూలు నగరపాలక సంస్థ సిబ్బంది.. చెత్త పన్ను ఎందుకు చెల్లించాలన్న దుకాణదారుల వాదనతో విసుగు చెంది.. ఏకంగా నగరవ్యాప్తంగా సేకరించిన చెత్తను ఆయా షాపుల ముందు పారబోశారు. దీంతో దుకాణదారులు షాక్ తిన్నారు.
నగరంలోని కొండారెడ్డి బురుజు సమీపంలో శ్రీనివాస క్లాత్ మార్కెట్ నుంచి అనంత కాంప్లెక్స్ వరకు ఉన్న షాపుల వద్ద చెత్త పన్ను వసూలు చేసేందుకు వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి మునిసిపల్ సిబ్బంది వెళ్లారు. ఆస్తి పన్ను, నీటి పన్నుతో పాటు ట్రేడ్ లైసెన్స్‌లకు కూడా రుసుము చెల్లిస్తున్నాం కదా? ఇక చెత్త పన్ను ఎందుకు చెల్లించాలని దుకాణదారులు సిబ్బందిని ప్రశ్నించారట.
ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకోగా.. సహనం కోల్పోయిన మునిసిపల్ సిబ్బంది నగరవ్యాప్తంగా సేకరించిన చెత్తను అక్కడికి తెప్పించి దుకాణాల ముందు పారబోసి వెళ్లారు.