హిజాబ్ లేనిదే రామంటూ.. క్లాసులతో పాటు పరీక్షలకూ గైర్హాజరు!
- హిజాబ్‌తోనే క్లాసులకు వస్తామన్న విద్యార్థినులు
- కుదరదన్న ఉడుపి విద్యాలయం
- హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థినులు
- విద్యాలయాల్లోకి హిజాబ్‌కు అనుమతి లేదన్న హైకోర్టు
- హిజాబ్‌ను అనుమతించేదాకా స్కూలుకెళ్లబోమన్న విద్యార్థినులు
హిజాబ్‌తోనే తాము విద్యాలయాలకు వస్తామంటూ భీష్మించిన ఉడుపి ముస్లిం విద్యార్థినులు అన్నంత పనీ చేశారు. విద్యాలయాల్లోకి హిజాబ్‌ను అనుమతించరాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ విద్యార్థినులు.. హిజాబ్‌ను అనుమతించేదాకా క్లాసులకు వెళ్లబోమంటూ మంగళవారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న చెప్పిన మాట ప్రకారమే బుధవారం నాడు వాళ్లంతా క్లాసులకు డుమ్మా కొట్టారు. అంతేకాకుండా తాము హాజరుకావాల్సిన పరీక్షలకు కూడా వారు గైర్హాజరయ్యారు.
తమను హిజాబ్‌తో పాఠశాలలోకి రానివ్వలేదంటూ ఉడుపి జిల్లాకు చెందిన ఆరుగురు ముస్లిం విద్యార్ధినులు నేరుగా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఒక్క కర్ణాటకనే కాకుండా యావత్తు దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు.. విద్యాలయాల్లోకి హిజాబ్‌కు అనుమతి లేదని తేల్చేసింది. ఈ తీర్పు తమకు న్యాయం చేయలేదని వ్యాఖ్యానించిన విద్యార్ధినులు హిజాబ్‌ను అనుమతించేదాకా తాము క్లాసులకే హాజరు కాబోమంటూ పేర్కొన్నారు. అంతేకాదు, హైకోర్టు తీర్పును వారు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి కూడా తెలిసిందే.