పంజాబ్ కొత్త సీఎం భ‌గ‌వంత్ మాన్‌కు మోదీ గ్రీటింగ్స్‌

  • పంజాబ్ సీఎంగా భ‌గ‌వంత్ ప్ర‌మాణం
  • ఆ వెంట‌నే విషెస్ చెబుతూ మోదీ ట్వీట్‌
  • పంజాబ్ అభివృద్ధికి క‌లిసి ప‌నిచేద్దామ‌ని పిలుపు
పంజాబ్ నూత‌న సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన ఆప్ నేత భ‌గ‌వంత్ మాన్‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం పంజాబ్‌లోని భ‌గ‌త్ సింగ్ స్వ‌గ్రామం ఖ‌త్క‌ర్ క‌లాన్‌లో పంజాబ్ నూత‌న సీఎంగా భ‌గ‌వంత్ ప్ర‌మాణ స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆప్ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్ స్వ‌యంగా హాజ‌రైన ఈ వేడుక అట్ట‌హాసంగా జ‌రిగింది.

ఈ వేడుక ముగిసిన కాసేప‌టికే భ‌గ‌వంత్‌కు అభినంద‌న‌లు తెలుపుతూ ప్ర‌ధాని ట్వీట్ చేశారు. పంజాబ్ అభివృద్దికి, రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమానికి క‌లిసి ప‌నిచేద్దామ‌ని ఈ సంద‌ర్భంగా భ‌గ‌వంత్‌కు మోదీ సూచించారు. కేంద్రం నుంచి పంజాబ్‌కు స‌హ‌కారం ల‌భిస్తుంద‌ని మోదీ చెప్పుకొచ్చారు.


More Telugu News