నులక మంచంపై కూర్చుని రైతుల సమస్యను పరిష్కరించిన కృష్ణా జిల్లా ఎస్పీ
- పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్పందన
- సత్ఫలితాలు సాధిస్తున్న కృష్ణా జిల్లా పోలీసు శాఖ
- రైతుల సమస్య పరిష్కారం కోసం గ్రామానికి వెళ్లిన ఎస్పీ
కృష్ణా జిల్లా ఎస్పీగా కొనసాగుతున్న యువ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ జిల్లా ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా స్పందన కార్యక్రమాన్ని పోలీసు శాఖ ఆధ్వర్యంలోనూ నిర్వహిస్తున్న ఆయన ఆయా సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రం మచిలీపట్నాన్ని వదిలి గ్రామ సీమలకు కూడా వెళుతున్నారు.
ఇందులో భాగంగా మంగళవారం నాడు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లాలోని సరిహద్దు గ్రామం కొత్తపల్లికి వెళ్లారు. అక్కడి రైతుల సమస్యల పరిష్కారం నిమిత్తం గ్రామ రైతులందరినీ ఓ చోటికి చేర్చి వారి మధ్యనే నులక మంచంపై కూర్చుని వారి సమస్యను ఇట్టే పరిష్కరించారు. ఈ విషయాన్ని కృష్ణా జిల్లా పోలీసు శాఖ ట్విట్టర్ వేదికగా తెలిపింది.