బాకీల తెలంగాణగా బంగారు తెలంగాణ: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణ
- తెలంగాణ జమాఖర్చులపై కాగ్ నివేదిక
- దాని ఆధారంగా 'వెలుగు' పత్రికలో కథనం
- ఆ కధనాన్ని బేస్ చేసుకుని ప్రవీణ్ ఆరోపణలు
బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని బాకీల తెలంగాణగా చేశారంటూ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బహుజన యాత్ర పేరిట తెలంగాణలో ఇటీవలే పాదయాత్ర మొదలుపెట్టిన ప్రవీణ్ వరుసగా తెలంగాణ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ సాగుతున్నారు.
ఈ విమర్శల్లో భాగంగా బుధవారం నాడు తెలంగాణ ప్రభుత్వ జమాఖర్చులపై కాగ్ విడుదల చేసిన నివేదికను ఆధారం చేసుకుని ప్రవీణ్ కుమార్.. కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. తమ పార్టీ ప్రభుత్వం వస్తే ప్రతి పైసా లెక్కను ప్రజలకు చూపిస్తామని ప్రకటించిన ఆయన.. ప్రజా ధనాన్ని దోచిన నాయకుల లెక్క కూడా తేలుస్తామంటూ హెచ్చరించారు. దోచిన డబ్బులను ముక్కు పిండి మరీ వసూలు చేసి రాష్ట్రంలో పాఠశాలలు, వైద్యశాలలు నిర్మిస్తామని ప్రవీణ్ తెలిపారు. కాగ్ నివేదికపై వెలుగు పత్రికలో వచ్చిన ఓ కథనాన్ని ప్రవీణ్ తన ట్వీట్‌కు జత చేశారు.