సినిమా చూసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ డే లీవ్ ప్రకటించిన అసోం!
- ద కశ్మీర్ ఫైల్స్‌పై ప్రశంసల వెల్లువ
- స్వయంగా వీక్షించిన ప్రధాని మోదీ
- ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు
- అంతకు మించి అన్నట్లుగా అసోం నిర్ణయం
సినిమా చూసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ డే సెలవును ప్రకటిస్తూ అసోం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 'ద కశ్మీర్ ఫైల్స్' సినిమా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌లోని హిందువులపై.. ముఖ్యంగా పండిట్లపై జరిగిన దారుణాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ సహా అనేక బీజేపి పాలిత రాష్ట్రాలు సినిమాపై వినోదపు పన్నును మినహాయిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అసోం ప్రభుత్వం ఈ సినిమాను చూసేందుకు తన ఉద్యోగులకు ఏకంగా హాఫ్ డే లీవ్‌ను ప్రకటించడం గమనార్హం.