తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు.. రీషెడ్యూల్ ప్రకటన
- జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల మార్పుతో ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్
- మే 6 నుంచి అదే నెల 23 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు
- మే7 నుంచి 24 వరకు రెండో సంవత్సర పరీక్షలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ మరోసారి మారింది. ఇటీవల జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షల తేదీలను మార్చిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులకు ఇబ్బంది కాకుండా ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను కూడా మార్చడం అనివార్యమైంది. జేఈఈ మెయిన్, ఇంటర్ పరీక్షలు ఒకే సమయంలో రాకుండా తెలంగాణ ఇంటర్ బోర్డు ఈ మేరకు ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్చి ప్రకటన విడుదల చేసింది.
దీని ప్రకారం.. మే 6వ తేదీ నుంచి అదే నెల 23వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు జరుగుతాయి. మే 7 నుంచి 24 వరకు రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. కాగా, ఇంటర్ పరీక్షలు ఆలస్యంగా జరుగుతుండడం, ఈ సారి పదో తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లు మాత్రమే ఉండడంతో పదో తరగతి పరీక్షలను ఇంటర్ పరీక్షల కంటే ముందే నిర్వహించాలన్న డిమాండ్ వస్తోంది.
ఇంటర్ పరీక్షల పూర్తి షెడ్యూల్..