హృదయవిదారకంగా జంగారెడ్డిగూడెం బాధితుల గోడు.. న్యాయం చేయండి: బుద్ధా వెంకన్న డిమాండ్
- కల్తీ సారా లేదని సీఎం అన్నారు
- ఇప్పుడేమో 22 మందిని అరెస్ట్ చేశారు
- ఇదిగో కల్తీసారాకు బలైన వారి వివరాలు
- బాధ్యులను అరెస్ట్ చేయాలన్న వెంకన్న
అసెంబ్లీ సాక్షిగా నాటుసారాపై సీఎం జగన్ అబద్ధాలు చెప్పారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి చనిపోయిన వారి వివరాలను ఆయన పేర్కొన్నారు. ‘‘జంగారెడ్డి గూడెంలో నాటుసారా తయారు కావడం లేదని 5 కోట్ల ఆంధ్రుల సాక్షిగా అసెంబ్లీలో జగన్ అబద్ధమాడారు. టీడీపీ పోరాటం తర్వాతే 33 కేసులు పెట్టి 22 మందిని అరెస్ట్ చేశారు.
కల్తీసారా తాగి చనిపోయిన వారి వివరాలను ఫోన్ నంబర్లతో సహా మీకు ఇస్తున్నాం. అంతేగాకుండా వరదరాజులు అనే మృతుడి భార్య మీకు రాసిన లేఖనూ అందిస్తున్నాం. మీకు ఈ విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఘటనపై విచారణ చేయించి బాధ్యులను అరెస్ట్ చేయాలి. హృదయవిదారకంగా మారిన బాధితులకు న్యాయం చేయాలి’’ అని ఆయన సీఎం జగన్ ను డిమాండ్ చేశారు.