కొనసాగుతోన్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. టీడీపీ సభ్యులపై మండిపడ్డ మంత్రులు
- జంగారెడ్డిగూడెం ఘటనపై టీడీపీ సభ్యుల తీరుపై కన్నబాబు మండిపాటు
- పరామర్శకు రాజకీయ యాత్రలా వెళ్లారని విమర్శ
- చంద్రబాబుకు భవిష్యత్‌పై ఆశలు పోయాయని వ్యాఖ్య
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. శాసన సభలో ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ టీడీపీపై మండిపడ్డారు. టీడీపీ శవ రాజకీయాలు చేస్తోందని అన్నారు. జంగారెడ్డిగూడెంలో మృతుల కుటుంబాల పరామర్శకు రాజకీయ యాత్రలా వెళ్లారని ఆయన విమర్శించారు. మరి గతంలో పుష్కరాల్లో మృతిచెందిన వారి కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారా? అని ఆయన నిలదీశారు.
సభలో ప్రతిరోజు టీడీపీ సభ్యులు స్పీకర్ ను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు భవిష్యత్‌పై ఆశలు పోయాయని, అందుకే ఆయనను పచ్చ మీడియా భుజానికెత్తుకుని మోస్తోందన్నారు. కాగా, టీడీపీ సభ్యులు రోజూ సభను అడ్డుకుంటున్నారని మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. వారి తీరు సరికాదని అన్నారు.