రేపే సీఎంగా భగవంత్ ప్రమాణం.. ఏర్పాట్లు ఎలాగున్నాయంటే..!
- భగత్ సింగ్ స్వగ్రామంలో వేడుక
- ఇప్పటికే పూర్తి కావచ్చిన ఏర్పాట్లు
- భారీ ఏర్పాట్లనే చేయించిన మాన్
సామాన్యుల పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రేపు దేశంలో రెండో రాష్ట్రంలో పాలనా పగ్గాలను చేపట్టనుంది. ఇప్పటికే ఢిల్లీ పాలనా పగ్గాలను ఎప్పుడో తనచేతిలోకి తీసుకున్న ఆప్.. తాజాగా ఇటీవల ముగిసిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌లో గ్రాండ్ విక్టరీని దక్కించుకుంది. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ ఏకంగా 92 సీట్లలో విజయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలో అప్పటికే ప్రజల తీర్పుతో ఆప్ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించిన భగవంత్ మాన్ సింగ్ రేపు (ఈ నెల 16) పంజాబ్ సీఎంగా పదవీ ప్రమాణం చేయనున్నారు.
ఇతర పార్టీల నేతల మాదిరిగా కాకుండా తాను స్వాతంత్య్ర సమర యోధుడు భగత్ సింగ్ స్వగ్రామం ఖత్కర్ కలాన్‌లో సీఎంగా ప్రమాణం చేస్తానని ప్రకటించిన మాన్.. అందుకోసం భారీ ఏర్పాట్లనే చేసుకుంటున్నారు. ఖత్కర్ కలాన్‌లో ఇప్పటికే మాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆడంబరాలకు అల్లంత దూరాన నిలిచే పార్టీగా ఆప్ జనాల్లోకి వెళ్లగా... అందుకు విరుద్ధంగా ఇతర పార్టీ నేతలు చేసే భారీ ఏర్పాట్ల తరహాలోనే మాన్ ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఈ తరహా ఏర్పాట్లపై పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఏమంటారోనన్న మాట కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది.