ఆ 5 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌ల రాజీనామాల‌కు సోనియా ఆదేశం

  • పార్టీ పున‌ర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌పై సోనియా దృష్టి
  • 5 రాష్ట్రాల పార్టీ శాఖ‌లకు ఆదేశాలు
  • త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాలంటూ పీసీసీ చీఫ్‌ల‌కు హుకుం
ఇటీవ‌లే ముగిసిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎదురైన ఘోర ప‌రాభ‌వం నేప‌థ్యంలో పార్టీని పటిష్ఠ‌ప‌రిచే ప‌నికి గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ చ‌ర్య‌లు మొద‌లుపెట్టింది. ఇప్ప‌టికే ఓటమిపై పోస్టుమార్టం పేరిట పార్టీ అత్యున్న‌త నిర్ణాయ‌క విభాగం కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యూసీ) స‌మావేశాన్ని నిర్వ‌హించిన పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ తాజాగా మంగ‌ళ‌వారం సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నిక‌లు ముగిసిన 5 రాష్ట్రాలు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, గోవా, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్‌ల‌కు చెందిన పార్టీ శాఖ‌ల చీఫ్‌లు (పీసీసీ) త‌క్ష‌ణ‌మే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయాల‌ని సోనియా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎన్నిక‌లు ముగిసిన 5 రాష్ట్రాల రాష్ట్ర శాఖ‌ల‌ను పున‌ర్వ్యవ‌స్థీక‌రించాల్సి ఉన్నందున పీసీసీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయాల‌ని ఆమె ఆదేశించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం పార్టీ అధికార ప్ర‌తినిధి ర‌ణ‌దీప్ సూర్జేవాలా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.


More Telugu News