'ఆర్ ఆర్ ఆర్' దర్శకుడిగా వేరొకరిని ఊహించుకోలేం: చరణ్
- రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్'
- ప్రధానపాత్రల్లో ఎన్టీఆర్ - చరణ్
- ఎన్టీఆర్ నుంచి ప్రేరణ పొందినట్టు చెప్పిన చరణ్
- ఈ నెల 25వ తేదీన విడుదల
రాజమౌళి దర్శకుడిగా ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'ఆర్ ఆర్ ఆర్' ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అల్లూరి సీతారామరాజును .. కొమరం భీమ్ ను కలిపి ఒకే తెరపై చూపించే సినిమా ఇది. విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.
తాజా ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడుతూ .. " ఎన్టీఆర్ గొప్ప ఆర్టిస్ట్ అని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు చూసి, అంతకన్నా బాగా చేయాలనే ఒక పట్టుదలతో ఉండేవాడిని. ఆయనతో పోటీపడటానికి ప్రయత్నించేవాడిని. అలా నటన పరంగా నన్ను నేను సరిచేసుకోవడానికి ఈ సినిమా ఎంతో హెల్ప్ అయింది.
ఇక ఈ సినిమాలో నేను చేసిన అల్లూరి పాత్ర నా కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుంది. ఈ సినిమాను రాజమౌళి కాకుండా మరో దర్శకుడు చేసుంటే ఈ పాత్రకి ఒప్పుకునేవారా? అని అంతా అడుగుతున్నారు. మా సంగతి తరువాత, అసలు ఈ సినిమాకి దర్శకుడిగా వేరొకరిని ఊహించుకోవడమే కష్టంగా ఉంది" అని చెప్పుకొచ్చాడు.