విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు చిన్నారుల మృతి

  • టెక్కలివలస వద్ద ఘటన
  • ఓ బైకుపై ఐదుగురి ప్రయాణం
  • బైకు, స్కూలు బస్సు ఢీ
  • ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు
  • ఓ చిన్నారికి తీవ్ర గాయాలు
విజయనగరం జిల్లా తెర్లాం మండలం టెక్కలివలసలో రహదారి నెత్తురోడింది. ఓ ద్విచక్రవాహనం, స్కూలు బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. తెర్లాం మండలం పెరుమాళ్లకు చెందిన ఐదుగురు ఓ బైకుపై రాజాం జాతరకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను రుషి (6), సిద్ధూ (9), హర్ష (6)గా గుర్తించారు. మరో చిన్నారికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువుల రోదనలతో ఘటనస్థలి శోకసంద్రాన్ని తలపిస్తోంది.


More Telugu News