సీఎం జగన్ ను కలిసిన తర్వాత ఎంతో తృప్తి కలిగింది: రాజమౌళి

  • తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసిన రాజమౌళి 
  • జగన్ సానుకూలంగా స్పందించారని వ్యాఖ్య 
  • ఉక్రెయిన్ లో 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ అద్భుతంగా జరిగిందన్న రాజమౌళి  
  • ఉక్రెయిన్ ప్రజలు ఎంతో సహకరించారని వెల్లడి 
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఇప్పటికే పలుమార్లు విడుదలను వాయిదా వేసుకున్న ఈ చిత్రం... ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదలకు కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. 

తాజాగా ఓ ప్రెస్ మీట్ లో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ ఉక్రెయిన్ గురించి భావోద్వేగానికి గురయ్యారు. 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ ను ఉక్రెయిన్ లో అద్భుతంగా చేశామని తెలిపారు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఆ దేశంలో యుద్ధం వస్తుందని కనీసం ఊహించలేదని చెప్పారు. షూటింగ్ టైమ్ లో ఉక్రెయిన్ ప్రజలు తమకు ఎంతో సహకరించారని తెలిపారు. అక్కడి వంటకాలు, వారి కల్చర్ తనకు ఎంతో నచ్చాయని చెప్పారు. ఇలాంటి యుద్ధ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని అన్నారు. 

మరోవైపు ముఖ్యమంత్రి జగన్ ను రాజమౌళి, నిర్మాత దానయ్య కలిసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ, సీఎం జగన్ ను కలిసిన తర్వాత తమకు ఎంతో తృప్తి కలిగిందని అన్నారు. జగన్ చాలా సానుకూలంగా స్పందించారని చెప్పారు. 'ఆర్ఆర్ఆర్' అనేది అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ ల జీవిత చరిత్ర కాదని... ఇదొక ఫిక్షన్ మూవీ అని తెలిపారు.


More Telugu News