పాక్ భూభాగంపైకి దూసుకుపోయిన భారత క్షిపణి ఘటనపై అమెరికా స్పందన!

  • మార్చి 9వ తేదీన పాక్ భూభాగంపై పడిన మిస్సైల్
  • ఈ ఘటన పొరపాటుగానే జరిగిందని చెప్పిన అమెరికా
  • భారత్ కూడా వివరణ ఇచ్చిందని వ్యాఖ్య
భారత్ కు చెందిన ఒక మిస్సైల్ పొరపాటున పాకిస్థాన్ భూభాగంపై పడిన సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు దీనిపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. పొరపాటుగానే ఈ ఘటన జరిగిందని వ్యాఖ్యానించింది. భారత్ చెప్పినట్టుగా ఈ ఘటన పొరపాటుగానే జరిగిందని, అంతకు మించి దీని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. ఈ ఘటనపై ఈనెల 9న భారత్ వివరణ ఇచ్చిందని... అందువల్ల దీనిపై తాము ఇంతకు మించి స్పందించలేమని చెప్పారు. 

మార్చి 9న ఈ ఘటన సంభవించిన సంగతి తెలిసిందే. ఒక క్షిపణికి సాధారణ తనిఖీలను నిర్వహిస్తున్న సమయంలో ప్రమదవశాత్తు అది గాల్లోకి లేచింది. దూసుకెళ్లి పాకిస్థాన్ భూభాగంపై పడింది. అయితే దానికి వార్ హెడ్ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేయగా... భారత రక్షణశాఖ వివరణ ఇచ్చింది. జరిగిన ఘటనపై విచారణ వ్యక్తం చేసింది. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఇప్పటికే ఆదేశించామని చెప్పింది.


More Telugu News