ఇది రెండు ప్రభుత్వాల పాపం.. తెలంగాణకు శాపం: రేవంత్ రెడ్డి
- 2014 నుంచి దేశ వ్యాప్తంగా 35 ప్రతిష్ఠాత్మక సంస్థలను నెలకొల్పారు
- తెలంగాణకు ఒక్క సంస్థ కూడా రాలేదు
- టీఆర్ఎస్, బీజేపీ పాలన నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ రెండు ప్రభుత్వాల వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. 2014 నుంచి దేశ వ్యాప్తంగా ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐడీ వంటి 35 ప్రతిష్ఠాత్మక సంస్థలను నెలకొల్పితే... తెలంగాణకు ఒక్కటీ రాలేదని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ పాలన నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ అని మండిపడ్డారు. ఇది రెండు ప్రభుత్వాల పాపమని, తెలంగాణకు శాపమని ఆవేదన వ్యక్తం చేశారు. 35 సంస్థల వివరాలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.