ప్ర‌భాస్‌ పిల్ల‌లతో ఆడుకోవాల‌ని ఉంది: కృష్ణంరాజు

  • ప్రభాస్‌ త్వరగా పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంద‌న్న కృష్ణంరాజు
  • రాధే శ్యామ్‌ సినిమా చాలా బాగుందని ప్ర‌శంస‌
  • అమితాబ్‌ బచ్చన్‌ రాధేశ్యామ్‌పై ప్రశంసలు కురిపించినట్లు వ్యాఖ్య‌
సినీ హీరో ప్ర‌భాస్ పెళ్లి గురించి గత కొంతకాలంగా పలు వార్త‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పెదనాన్న కృష్ణంరాజు మ‌రోసారి ఈ విషయంపై స్పందించారు. ప్రభాస్‌, పూజా హెగ్డే నటించిన 'రాధేశ్యామ్' భారీగా వ‌సూళ్లు రాబ‌డుతోన్న నేప‌థ్యంలో కృష్ణంరాజు ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... ప్రభాస్‌ త్వరగా పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంద‌ని చెప్పారు. 

ప్రభాస్‌కు పుట్టబోయే పిల్లలతో ఆడుకోవాలని ఉంద‌ని అన్నారు. కృష్ణంరాజు తొలిసారి ఇలా త‌న‌ మనసులో మాటను బయటపెట్టారు. కాగా, 'రాధేశ్యామ్‌' సినిమా చాలా బాగుందని కృష్ణంరాజు అన్నారు. ఈ సినిమాలో ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని తెలిపారు. బాలీవుడ్ దిగ్గ‌జ‌ న‌టుడు అమితాబ్‌ బచ్చన్‌ 'రాధేశ్యామ్‌'పై ప్రశంసలు కురిపించినట్లు ఆయ‌న చెప్పారు.  


More Telugu News