ర‌ష్యా, ఉక్రెయిన్‌ల మ‌ధ్య నాలుగో విడ‌త చ‌ర్చ‌లు.. రేపూ కొన‌సాగింపు

  • ఇప్ప‌టికే మూడు విడ‌త‌ల చ‌ర్చ‌లు
  • సోమ‌వారం నాడు నాలుగో విడ‌త చ‌ర్చ‌లు
  • వ‌ర్చువ‌ల్ విధానం ద్వారా ఇరు దేశాల భేటీ
  • మంగ‌ళ‌వారమూ కొన‌సాగుతాయంటూ ప్ర‌క‌ట‌న‌
యుద్ధంలో త‌ల‌ప‌డుతున్న ర‌ష్యా, ఉక్రెయిన్ల మ‌ధ్య ఇప్ప‌టిదాకా మూడు విడ‌త‌లుగా చ‌ర్చ‌లు జ‌రిగినా పెద్ద‌గా ఫ‌లితం రాలేద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో నాలుగో విడ‌త చ‌ర్చ‌లు వ‌ర్చువ‌ల్ విధానంలో సోమ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. అయితే ఈ చ‌ర్చ‌ల్లో సోమ‌వారం రాత్రి దాకా ఎలాంటి ఫ‌లితం రాక‌పోగా... ఇరు దేశాలు మంగ‌ళ‌వారం కూడా చర్చ‌ల‌ను కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించాయి. 

మొత్తంగా సోమవారం చ‌ర్చ‌ల్లో ఫ‌లితం రాకున్నా.. చ‌ర్చ‌ల‌ను ముగిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించేందుకు ఇష్ట‌ప‌డని ఇరు దేశాలు చ‌ర్చ‌ల‌ను మంగ‌ళ‌వారం కూడా కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం. ఇరు వ‌ర్గాలు త‌మ త‌మ డిమాండ్ల‌ను ప్ర‌స్తావించుకున్న త‌ర్వాత వాటిపై నిర్ణ‌యం తీసుకునేందుకు స‌మ‌యం తీసుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా స‌మాచారం. ఈ క్ర‌మంలోనే నాలుగో విడ‌త చ‌ర్చ‌లు ముగిసిన‌ట్టుగా ప్ర‌క‌టించ‌ని ఇరు దేశాలు మంగ‌ళ‌వారం కూడా ఆ చ‌ర్చ‌ల‌నే కొన‌సాగించ‌నున్న‌ట్లుగా పేర్కొన్నాయి. ఇరు వ‌ర్గాల పట్టువిడుపులు చూస్తుంటే... ఈ ద‌ఫా చ‌ర్చ‌ల్లో ఫ‌లితం వ‌చ్చేలాగే క‌నిపిస్తోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.


More Telugu News